Wednesday, May 1, 2024

OTT | ఓటీటీ లోకి వ‌చ్చేస్తున్న ‘‘మ్యాడ్”.. రిలీజ్ అప్పుడే..!

టాలీవుడ్ తెరపై రీసెంట్ గా రిలీజ్ అయిన క్రేజీ అండ్ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’. ఈ సినిమాతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమయ్యారు. కాగా, ఈ మూవీ అక్టోబర్ 6న థియేట‌ర్ల‌లో విడుదలై.. మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇక మూవీలో రామ్ నితిన్, సంగీత్ శోభన్, నార్నే నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌ కుమార్, గోపికా ఉద్యన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇక థియేట‌ర్ల‌లో సంద‌డి చేసిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్.. ఇప్పుడు ఓటీటీలోకి వ‌చ్చేందుకు రెడీ అయ్యింది. నవంబర్ 3న ప్ర‌ముక ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే, ఓటీటీ రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన త్వరలో రానుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement