Sunday, April 21, 2024

ప్రపంచవ్యాప్తంగా… ‘వకీల్ సాబ్’కు 64వ స్థానం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వం లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వకీల్ సాబ్. బాలీవుడ్ లో అమితాబ్ నటించిన పింక్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. అలాగే నివేద థామస్, అంజలి, అనన్య కీలక పాత్రలు పోషించారు. అయితే ఈ సినిమా ఇటీవలె వరల్డ్ టీవీ ప్రీమియర్ గా జీ తెలుగు లో ప్రసారమయ్యి మంచి టిఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకుంది.

ఇదిలా ఉండగా తాజా నివేదికలో ప్రపంచవ్యాప్తంగా 2021లో భారీ వసూళ్లు రాబట్టిన చిత్రాలలో వకీల్ సాబ్ 64వ స్థానంలో నిలిచింది. ఇండియాలో మొదటగా 45వ స్థానంలో విజయ్ మాస్టర్ చిత్రం నిలిచింది. 66వ స్థానంలో ఉప్పెన, 69వ స్థానంలో జాతిరత్నాలు, 70వ స్థానంలో క్రాక్ సినిమాలు నిలిచాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement