Thursday, April 25, 2024

టోక్యో ఒలింపిక్స్: నిరాశపరిచిన భారత ఆర్చర్లు..

టోక్యో ఒలింపిక్స్ ఈ సారి మెడ‌ల్ ఖాయ‌మ‌నుకున్న గేమ్స్‌లో ఆర్చ‌రీ ఒక‌టి. కానీ తొలి రోజే అర్హ‌త రౌండ్ల‌లో మ‌న ఆర్చ‌ర్లు నిరాశ‌ప‌రిచారు. శుక్రవారం ఉదయం యుమెనొషిమా పార్క్‌లోని ఆర్చరీ ఫీల్డ్‌లో జరిగిన క్వాలిఫకేషన్ రౌండ్‌లో దీపికా కుమారి 9వ స్థానంలో నిలిచింది. అయితే ఆమె జులై 27 నుంచి ప్రారంభం కానున్న రౌండాఫ్ 32 ఎలిమినేషన్ రౌండ్స్‌లో పాల్గొననున్నది. ఆమె భూటాన్‌కు చెందిన కర్మతో రౌండాఫ్ 32లో తలపడనున్నది. దక్షిణ కొరియాకు చెందిన ఆర్చర్ కాంగ్ చియాంగ్ 692 పాయింట్లతో మహిళ వ్యక్తిగత కర్వ్‌లో వరల్డ్ రికార్డు సాధించింది. పురుషుల సింగిల్స్‌లో అయితే మ‌న వాళ్ల ప్ర‌ద‌ర్శ‌న మ‌రింత దారుణంగా ఉంది. ర్యాంకింగ్ రౌండ్‌లో ప్ర‌వీణ్ జాద‌వ్ 656 పాయింట్ల‌తో 31వ స్థానంలో నిలిచాడు. ఇండియా త‌ర‌ఫున అత‌డిదే బెస్ట్ ర్యాంక్‌. ఇక అతాను దాస్ అయితే 653 పాయింట్ల‌తో 35వ స్థానానికి ప‌రిమిత‌మ‌య్యాడు. అయితే ప్ర‌వీణ్ కంటే రెండు 10లు ఎక్కువ కొట్టాడు. అతను మొత్తం 24 10లు సాధించాడు. మ‌రో ఆర్చ‌ర్ త‌రుణ్‌దీప్ రాయ్ 37వ స్థానంతో స‌రిపెట్టుకున్నాడు. క్వాలిఫికేషన్ రౌండ్ ముగిసే సరికి టాప్ 3లో సౌత్ కొరియా ఆర్చర్లే ఉండటం గమనార్హం.

ఇది కూడా చదవండి:కాక పుట్టిస్తున్న పెగాసస్.. హోంమంత్రి రాజీనామా చేయాలని ప్రతిపక్షాల డిమాండ్

Advertisement

తాజా వార్తలు

Advertisement