Sunday, April 28, 2024

OTT | ప్రేక్ష‌కుల‌ నిరీక్షణకు తెర.. “స్కామ్ 2003” సీజ‌న్-2 పై లేటెస్ట్ అప్డేట్

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ సోని లీవ్‌లో 2020 అక్టోబ‌ర్ 9న రిలీజ్ అయ్యి మంచి వ్యూయ‌ర్ షిప్ ని ఆక‌ర్షించిన సిరీస్ “స్కామ్ 1992: ది హర్షద్ మెహతా స్టోరీ”. స్టాక్ బ్రోక‌ర్ హ‌ర్ష‌ద్ మెహ‌తా జీవిత చ‌రిత్ర ఆధారంగా హర్షల్‌ మెహతా దర్శకత్వంలో ఈ వెబ్‌సిరీస్‌ను తెర‌కెక్కించారు. ఇక ఓటీటీలో మంచి మౌత్ టాక్‌తో భారీ విజ‌యాన్ని సొంతం చేసుకుంది.

ఇక రీసెంట్‌గా ఆయన నిర్మాణ సంస్థలో తుషార్‌ దర్శకత్వంతో మరో స్కామ్ స్టోరీ వ‌చ్చింది. స్కామ్ 2003: ది తెల్గీ స్టోరీ అంటూ వ‌చ్చిన ఈ వెబ్ సిరీస్ 2003లో ఫేక్ స్టాంప్ పేపర్స్ సృష్టించి బ్యాంకులను, ఇన్సూరెన్స్ కంపెనీల‌ను మోసం చేసిన ‘అబ్దుల్ కరీం తెల్గి‘ జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కింది.

సెప్టెంబరు 2 నుంచి సోని లీవ్‌లో స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్ కూడా మంచి టాక్ తెచ్చుకుంది. ఇక తొలి పార్ట్ చూసిన వారందరూ పార్ట్‌-2 ఎప్పుడు వస్తుందా.. అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే మేక‌ర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. ‘స్కామ్‌ 2003’ పార్ట్‌-2ను నవంబరు 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్లు ప్రక‌టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement