Sunday, April 28, 2024

Hanu-Man ఓటీటీ రిలీజ్‌పై లేటెస్ట్ బజ్..

తేజ సజ్జ హీరోగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన సూపర్ హీరో మూవీ “హను మాన్”. ఈ మూవీ రిలీజ్ అయి థియేటర్స్ లో సెన్సేషనల్ వసూళ్లు రాబట్టింది. ఇక, ప్రస్తుతం అందరూ ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కోసం వేయిట్ చేస్తున్నారు. కాగా, ఇప్పటికే ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 సొంతం చేసుకుంది.

తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. ఈ మూవీ వచ్చే నెల మొదటి వారం నుండి ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులో ఉండనున్నట్టు తెలుస్తొంది. ఏకకాలంలో పాన్ ఇండియన్ భాషల్లో జ5 లో అందుబాటులోకి రానున్నట్టు సినీ వర్గాల సమాచారం. అయితే దీనిపై అఫీషియల్ అప్‌డేట్ రావాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement