Wednesday, May 1, 2024

బుల్లితెరపై క్రాక్ టిఆర్పి రేటింగ్ సూపర్ !!

సరైన హిట్ లేక ఎప్పటినుంచో సతమతమవుతున్న మాస్ మహారాజ రవితేజకు గోపీచంద్ మలినేని క్రాక్ సినిమాతో మంచి హిట్ ను ఇచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో పాటు వసూళ్లను కూడా బాగానే రాబట్టింది. మరో వైపు రవితేజ కెరీర్ లోనే వసూళ్ళ పరంగాఈ సినిమా బిగ్గెస్ట్ సినిమాగా నిలిచింది. అయితే వెండితెరపై కాసుల వర్షం కురిపించిన క్రాక్ సినిమా ఇప్పుడు బుల్లితెరపై కూడా అదే స్థాయిలో టిఆర్పి రేటింగ్ ను సాధించింది.

ఇటీవల క్రాక్ సినిమా స్టార్ మా లో ప్రసారం అయ్యింది. కాగా ఈ సినిమాకు 11.7 టిఆర్పి రేటింగ్ వచ్చింది. గతంలో లో రవితేజ సినిమా కు ఈ స్థాయిలో రేటింగ్స్ వచ్చిన పరిస్థితులు పెద్దగా ఎప్పుడూ కనిపించలేదు. ఇక వెండితెరతోపాటు బుల్లితెరపై కూడా మాస్ మహారాజా సక్సెస్ ని ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement