Sunday, April 28, 2024

Kollywood : బాక్ లో గ్లామ‌ర్ తారల‌ చిందులు

కోలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ హారర్ కామెడీ ఫ్రాంచైజీ అరణ్మనై నాలుగో పార్ట్ విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. వేసవి కానుకగా ఈ నెల‌ 26వ తేదీన రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని నటి ఖుష్బూ భర్త, డైరెక్టర్ సుందర్ సి తెరకెక్కిస్తున్నారు.
దర్శకత్వం వహించడంతో పాటు హీరోగా కూడా ఆయన నటిస్తున్న ఈ సినిమాకు తెలుగులో బాక్ అని టైటిల్ ఫిక్స్ చేశారు. సౌత్ హీరోయిన్లు తమన్నా, రాశీ ఖన్నా లీడ్ రోల్స్ పోషిస్తున్నారు.

కొన్ని రోజుల క్రితం మేకర్స్.. తెలుగులో ప్రమోషన్స్ మొదలుపెట్టారు. సుందర్‌ సి, తమన్నా, రాశీ ఖన్నా, వెన్నెల కిషోర్ ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేశారు. నలుగురి ఫస్ట్ లుక్ పోస్టర్లు.. సినిమాపై ఆసక్తి పెంచుతున్నాయి. శివానిగా తమన్నా, శివశంకర్ గా సుందర్ సినిమాలో కనిపించబోతున్నారు.

- Advertisement -

ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా మేకర్స్.. పంచుకో సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇట్స్ పంచుకో డే అంటూ షేర్ చేశారు. ఏప్రిల్ 26వ తేదీన మళ్లీ కలుద్దామని ట్వీట్ చేశారు. సాంగ్ లో హీరోయిన్లలిద్దరూ ట్రెండీ డ్రెస్సులు ధరించి ఓ రేంజ్ లో డ్యాన్స్ చేశారు. హిప్ హాప్ తమిజా అందించిన మ్యూజిక్ కు హుక్ స్టెప్పులతో తమన్నా, రాశి అలరించారు. నడుమును ఒక ఊపు ఊపి అదరగొట్టారు. సాంగ్ మధ్యలో కొన్ని సీన్స్ కూడా చూపించారు మేకర్స్.

అయ్యో అయ్యో అయ్యయ్యో అంటూ సాగుతున్న ఈ పాటను తమన్నా, రాశీ ఖన్నా గ్లామర్ మరింత అందంగా మార్చింది. సాహితి ఫన్నీ లిరిక్స్ రాయగా, రాఘవి తన హస్కీ వాయిస్ తో అలరించారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ మారగా.. తమన్నా, రాశి గ్లామర్ డోస్ అదిరిపోయిందని చెబుతున్నారు నెటిజన్లు. వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్ గా మారబోతుందని అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement