Wednesday, May 1, 2024

‘కీడా కోలా’ మూవీ న‌టుడు హ‌రికాంత్ గుండెపోటుతో క‌న్నుమూత‌.. .

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ‘కీడా కోలా’ లో కీలక పాత్రలో నటించిన హరికాంత్‌ (33) హఠాన్మరణం చెందారు. శనివారం ఉదయం హఠాత్తుగా గుండె పోటు రావడంతో ఆయన మృతి చెందినట్లు వంశీ కాకా ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. యువ నటుడు హరికాంత్‌ మృతిపట్ల చిత్ర బృందంతోపాటు పలువురు సినీ సెలబ్రెటీలు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

కాగా థియేటర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు హరికాంత్ సినిమాల్లో నటిస్తూ ఇప్పుడిప్పుడే గుర్తింపు దక్కించుకుంటున్నాడు. పలు సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రల్లో నటించాడు. ప్రస్తుతం ‘కీడా కోలా’లో ఓ కీలక పాత్రలో హరికాంత్‌ నటిస్తున్నాడు. రెండు రోజుల క్రితం విడుదలైన టీజర్‌లోనూ హరికాంత్ క‌నిపించాడు.. అంత‌లోనే గుండెపోటుతో మ‌ర‌ణించాడు…

Advertisement

తాజా వార్తలు

Advertisement