Saturday, July 27, 2024

నీల్ మావా మాస్ ఐడియా.. ప‌వ‌ర్‌ఫుల్ విల‌న్ పాత్ర‌లో క‌మ‌ల్ హ‌స‌న్‌.?

పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కించిన కేజీఎఫ్‌ 2 సినిమాలతో పెద్ద సెన్సేషన్ క్రియేట్‌ చేశాడు డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్. ప్రస్తుతం యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌తో సలార్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇక‌.. తారక్‌ పుట్టినరోజు సందర్భంగా ‘హ్యాపీబర్త్‌డే ఎన్టీఆర్‌ 31’ ట్యాగ్‌లైన్‌తో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌తో మరో చిత్రాన్ని ప్రకటించాడు ప్రశాంత్ నీల్‌. రిలీజ్ చేసిన పోస్టర్‌లో తారక్‌ లుక్‌తో సినిమా ఎంత మాస్‌గా ఉండబోతుందో రివీల్‌ చేసి ప్రేక్షకులను, అభిమానులను ఆశ్చర్యపరిచాడు. అయితే ఎన్టీఆర్‌ 31వ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో తారక్‌ను ఢీకొట్టే విలన్‌ పాత్రలో యూనివర్సల్‌ హీరో కమల్‌ హాసన్‌ను బరిలోకి దించనున్నాడట నీల్.

ఇటీవల విడుదలై విక్రమ్‌ ట్రైలర్‌లో కమల్ లుక్స్‌ మాస్‌గా, రఫ్‌గా కనిపించడంతో ఆయన అయితేనే ఈ మూవీలో విలన్‌ రోల్‌కు సరిగ్గా సరిపోతాడని ప్రశాంత్ భావించినట్లు సమాచారం. అయితే ఈ సినిమా కథను కమల్‌ హాసన్‌కు వినిపించగా, ఆయన కూడా kamalకథ బాగా నచ్చి ఓకే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్‌ ‘ఇదెక్కడి మాస్‌ ఐడియా నీల్‌ మావా’ అనుకుంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ఇటు ఎన్టీఆర్‌, అటు కమల్‌ హాసన్‌ యాక్టింగ్‌ చూసేందుకు రెండు కళ్లు సరిపోవు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement