Monday, May 20, 2024

Kalki 2989 AD | అశ్వత్థామగా అమితాబ్.. గ్లింప్స్ రిలీజ్

ప్రభాస్ నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ ఫిల్మ్ ‘కల్కి 2989 ఏడీ’ మూవీ నుంచి లేటెస్ట్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ పాన్ ఇండియ‌న్ సినిమానుంచి బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ యాంగ్రీ యంగ్ మ్యాన్ లుక్, ఓల్డ్ లుక్ – రెండు చూపించి పాన్ ఇండియా ప్రేక్షకులకు మంచి గిఫ్ట్ ఇచ్చారు. ఆయన ద్రోణాచార్య పుత్రుడు అశ్వత్థామ పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు.

‘కల్కి’లో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ఓ కథానాయికగా నటిస్తున్నారు. ఆల్రెడీ విడుదలైన మూవీ గ్లింప్స్‌లో ఆమెను చూపించారు. దీపికాతో పాటు దిశా పటానీ మరో కథానాయికగా నటిస్తున్నారు. ఇక కల్కి’ సినిమాలో లెజెండరీ యాక్టర్స్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement