Thursday, April 25, 2024

బాలయ్య NBK108 సెట్స్‌లో జాయిన్ అయిన కాజల్.. ప్రకటించిన మేకర్స్

రావిపూడి దర్శకత్వంలో నటసింహ నందమూరి బాలకృష్ణ చేస్తున్న లెటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ #NBK 108. ఈ బిగ్గీలో శ్రీలీల కూడా కీలక పాత్ర పోషిస్తోంది. కాగా, ఈ మూవీకి సంభందించి ఇవ్వాల మేకర్స్ ఒక ఆసక్తికరమైన అప్‌డేట్‌తో ముందుకు వచ్చారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో కాజల్ అగర్వాల్ అధికారికంగా బోర్డులో ఎంటర్ అయినట్టు టీమ్ అఫీషియల్ గా ప్రకటించారు.

- Advertisement -

నటి ఈరోజు హైదరాబాద్‌లో అడుగుపెట్టింది అంతే కాకుండ మూవీ సెట్స్‌లో జాయిన్ అయ్యిందని వెల్లడించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నిడు. ఇక NBK108పై మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్ త్వరలోనే వెలువడనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement