Saturday, March 2, 2024

మేమ్ ఫేమ‌స్ చూశా.. ట్వీట్ చేసిన మ‌హేశ్ బాబు

మేమ్ ఫేమ‌స్ సినిమాని తాను చూశాన‌ని.. బ్రిలియంట్ గా ఉంద‌న్నారు స్టార్ హీరో మ‌హేశ్ బాబు తెలిపారు. ఈ సినిమాలో ప్రతి ఒక్కరి పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. ముఖ్యంగా ఈ సినిమాకు రచయిత, దర్శకుడు, హీరో అయిన సుమంత్ ప్రభాస్ గురించి చెప్పుకోవాలి… ఏం టాలెంట్! విజువల్స్ కానీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఇతర విభాగాలు కానీ అన్నీ సరిగ్గా కుదిరాయి. ఈ సినిమాలో చాలామంది కొత్తవాళ్లే అంటే నమ్మలేకపోతున్నాను. నిర్మాతలు శరత్ చంద్ర, అనురాగ్ రెడ్డిలకు, యువ చిత్రబృందానికి శుభాభినందనలు. ప్రతిభావంతులకు మద్దతుగా నిలిచినందుకు మీ పట్ల గర్విస్తున్నాను” అంటూ మహేశ్ బాబు ట్వీట్ చేశారు. సుమంత్ ప్రభాస్ హీరోగా స్వీయ రచనాదర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘మేమ్ ఫేమస్’. ఈ సినిమా మే 26 ప్రేక్షకుల ముందుకు వస్తోంది. చాయ్ బిస్కెట్ అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ ఈ సినిమాకు నిర్మాతలు. ఇందులో దాదాపు అందరూ కొత్తవారే. కాగా, ఈ సినిమాను విడుదలకు ముందు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు వీక్షించారు. అనంతరం సోషల్ మీడియా ద్వారా తన స్పందనను పంచుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement