Saturday, May 4, 2024

డైలాగ్లు, యాక్షన్లతో విజువల్ వండర్ గా షారూక్ ఖాన్ ‘ జవాన్ ట్రైలర్’

YouTube video

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్.. లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా నటించిన సినిమా ‘జవాన్.. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్ర ట్రైలర్ రానే వచ్చింది. సినిమా ప్రమోషన్స్లో ఫుల్ జోరుగా ఉన్న మూవీ టీమ్.. తాజాగా 2:45 నిమిషాల నిడివి గల వీడియోను రిలీజ్ చేసింది. అదిరిపోయే డైలాగ్లు, యాక్షన్ సన్నివేశాలతో, కళ్లు చెదిరే విజువల్స్తో అభిమానులను ఆకట్టుకునేలా ఉంది ఈ వీడియో. పవర్ ఫుల్ యాక్షన్తో ఈ చిత్రం ఉండబోతోందని ట్రైలర్ చూస్తే అర్థమైపోతోంది.

తాజా వీడియోలో విజయ్ సేతుపతి విలన్ లుక్ను కూడా రివీల్ చేశారు. ఆయుధాల స్మగ్లర్గా సేతుపతిని చూపించారు. ఈ సినిమాలో దీపికా పదుకొణె స్పెషల్ రోల్లో కనిపించనుంది. ప్రియమణి కూడా పోలీస్ ఆఫీసర్గా ఓ కీలక పాత్రలో సందడి చేయనుంది.

- Advertisement -

అనిరుధ్ అదిరిపోయే బ్రాక్ గ్రౌండ్ మ్యూజిక్తో షారుక్ను హై రేంజ్లో ఎలివేట్ చేశారు. అట్లీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను రెడ్ చిల్లీ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నారు. షారుక్ భార్య గౌరీ ఖాన్ నిర్మాత .

Advertisement

తాజా వార్తలు

Advertisement