Monday, May 6, 2024

నిలకడగా పవన్ ఆరోగ్యం – అప్డేట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరోనా మహమ్మారి బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే దీంతో అభిమానులు సినీ రాజకీయ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేస్తున్నారు. అయితే పవన్ కు కరోనా పాజిటివ్ అని తేలిన అప్పటినుంచి కూడా అభిమానులు భయాందోళన చెందుతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం పవన్ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది. కాగా తన కోసం ప్రార్థనలు జరిపిన, ప్రతి ఒక అభిమానికి, తన ఆరోగ్యం పట్ల స్పందించిన ప్రతి ఒక్క నటులకు, రాజకీయ నాయకులకు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.

అంతేకాకుండా ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ లు వినియోగించాలని సూచించారు. ఈ మేరకు ఓ లేఖను విడుదల చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement