Friday, April 26, 2024

షూటింగ్ చివరి ధశకు చేరుకున్న “జైలర్”..

డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ‘తలైవర్ 169’ అనే వర్కింగ్ టైటిల్ తో ప్రారంభమైన మూవీ ‘జైలర్’. ఈ మూవీ డార్క్ కామెడీ ఫార్ములాతో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ అని సమాచారం. రజినీకాంత్ తో పాటు మోహన్ లాల్, జాకీ ష్రాఫ్ వంటి స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతన్న ఈ సినిమాలో మరి కొంతమంది ప్రముఖ నటులు కూడా ప్రస్తుత షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం. ఇటీవలే 100 రోజుల షూటింగ్ పూర్తి చేసుకుని మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక ఏప్రిల్ రెండో వారం నాటికి ఈ సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తవుతుందని అంటున్నారు.

ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్ననారు మేకర్స్. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో రజినీకాంత్ తో పాటు మోహన్ లాల్, శివరాజ్ కుమార్, రమ్య కృష్ణ, సునీల్, తమన్నా మొదలగు భారీ తారాగణం నటిస్తున్నారు. ఇక అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సూపర్ స్టార్ రజినీకాంత్ తో తన మూడో చిత్రం కావడంతో ఆయన పనితనం అద్భుతంగా ఉంటుందని అందరూ అంచనా వేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement