Wednesday, April 17, 2024

కేటీఆర్ రాజీనామా చేయాలని కోరుతూ బిజెపి ధర్నా…

ఖమ్మం : TSPSC పరీక్ష పేపర్ లీకేజ్ కు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర మంత్రి KTR రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని ధర్నా చౌక్ వద్ద నిరసన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గల్లా మాట్లాడుతూ, TSPSC పేపర్ లీకేజ్ వల్ల సుమారు 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలు అగమ్య గోచరంగా మారాయని, ఎంతో కష్టనష్టాలకు వచ్చి లక్షలాది రూపాయలు ఫీజులు చెల్లించి కోచింగ్ తీసుకొని విద్యార్థులు పరీక్షలు రాసిన తర్వాత పేపర్ లీకేజ్ వ్యవహారం వెలుగులోకి వచ్చి యువత మొత్తం నిరాశ మానసిక క్షోభకు గురవుతున్నారని అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం TSPSC పరీక్ష రాసిన ప్రతి విద్యార్థికి లక్ష రూపాయల చొప్పున ష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గెంటెల విద్యాసాగర్, దేవకి వాసుదేవరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి రుద్ర ప్రదీప్, జిల్లా ఉపాధ్యక్షులు మందా సరస్వతి, బోయినపల్లి చంద్రశేఖర్, వేల్పుల సుధాకర్, గుత్తా వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి నకరికంటి వీరభద్రం, జిల్లా అధికార ప్రతినిధి వీరవల్లి రాజేష్ గుప్తా, మహిళా మోర్చా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శిలు దొడ్డ అరుణ, పమ్మి అనిత, అర్బన్ టౌన్ అధ్యక్షులు కుమిలి శ్రీనివాస్, టూ టౌన్ అధ్యక్షులు తాజ్ నూత్ భద్రం, త్రీ టౌన్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ గుప్తా, రఘునాథపాలెం మండల అధ్యక్షులు పొట్లపల్లి నాగేశ్వరరావు, నాయకులు ఢీకొండా శ్యామ్, శాసనాల సాయిరాం, అంకతి పాపారావు, సురేష్, పసుమర్తి సతీష్, జంగిల్ రమణ, శంకర్ గౌడ్, ఫణి కుమారి, సుగుణ, జంపా, వల్లాల రమేష్ తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement