Thursday, April 25, 2024

ఎఫ్3 లో అంజలికి అవకాశం అందుకే వచ్చిందా ?

అనిల్ రావిపూడి దర్శకత్వం లో వరుణ్ తేజ్ ,విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలలో ప్రేక్షకులముందుకు వచ్చిన సూపర్ డూపర్ హిట్ మూవీ ఎఫ్2. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టడంతో పాటు మంచి వసూళ్లను కూడా రాబట్టింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ గా ఎఫ్ 3 చిత్రం ప్రస్తుతం తెరకెక్కుతోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో కూడా వరుణ్ తేజ్, వెంకటేష్, మెహరీన్ ,తమన్నా నటిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఎఫ్3 లో హాట్ బ్యూటీ సోనాల్ చౌహాన్ కూడా నటిస్తుందని ఆమధ్య వార్తలు రాగా…ఇటీవల అంజలి పేరు కూడా తెరపైకి వచ్చింది. దీనితో అంజలి ఈ మధ్య లోకి ఎలా వచ్చిందనే ఆలోచన సినీ అభిమానులలో కూడా కలిగింది. దానికి కారణం లేకపోలేదట. దిల్ రాజు నిర్మించిన వకీల్ సినిమాలో అంజలి తన నటన తో అద్భుతంగా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే అంజలికి అవకాశం కల్పించాడట దిల్ రాజు. కాగా ప్రీ క్లైమాక్స్ లో వచ్చే అంజలి పాత్ర హైలెట్ గా నిలుస్తుందని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement