Wednesday, May 8, 2024

ప‌వ‌న్ క‌ల్యాణ్ తో వంద సినిమాలైనా చేస్తా.. స‌ముద్ర‌ఖ‌ని

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒప్పుకుంటే ఆయ‌న‌తో వంద చిత్రాలైనా తీస్తాన‌ని చెప్పారు న‌టుడు..ద‌ర్శ‌కుడు స‌ముద్ర‌ఖ‌ని. ఈ మధ్య తెలుగులోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పవన్ కళ్యాణ్ బ్రో సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సాయిధరమ్ తేజ్ మరో ప్రధాన హీరోగా నటిస్తున్న ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన వినోదయ సిత్తం రీమేక్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జ‌రిగాయి. జూలై 28న విడుదల కాబోతున్న ఈ సినిమాపై అందరిలోనూ అమితాసక్తి నెలకొంది. దానికితోడు ఇటవలే రిలీజైన ఫస్ట లుక్ పోస్టర్ కు తిరుగులేని రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా సముద్రఖని ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. త్వరలోనే టీజర్ ను విడుదల చేసే ప్లాన్ లో ఉన్నట్లు తెలిపాడు. ఇప్పటికే టీజర్ కట్ కు సంబంధించిన పనులు స్టార్ట్ చేసినట్లు వెల్లడించాడు. అంతేకాకుండా ఫస్ట్ ఆఫ్ కు సంబంధించిన డబ్బింగ్ పనులు పూర్తయ్యాయని, సెకండ్ ఆఫ్ డబ్బింగ్ పనులు త్వరలోనే స్టార్ట్ చేస్తున్నట్లు తెలిపాడు. ఇక పవన్ కళ్యాణ్ తో రెండవ సినిమా చేస్తారా అనే ప్రశ్నకు.. పవన్ కళ్యాణ్ గారితో వంద సినిమాలు చేయడానికైనా రెడీగా ఉన్నా అన్నారు. నా దగ్గర చాలా కథలున్నాయని, ఆయన నుంచి పిలుపు రావడమే ఆలస్యం.. సినిమా చేసేందుకు నేను రెడీగా ఉంటానని తెలిపాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement