Thursday, June 13, 2024

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్..

ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తొలిసారి ఒక మాస్ ఎంటర్‌టైనర్ సినిమా కోసం చేతులు కలిపారు. RAPO 20 అని వర్కింగ్ టైటిల్ తో ప్రస్తుంతం షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాలో రామ్ పక్కన శ్రీలీల కథానాయికగా కనిపించనుంది.

కాగా, ఈ మూవీ ఈ ఏడాది అక్టోబర్ 20న థియేటర్‌లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. మరో క్రేజీ న్యూస్ ఏమిటంటే, ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇదే విషయాన్ని తెలియజేసేందుకు మేకర్స్ ఘాటైన పోస్టర్‌ను విడుదల చేశారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో ప్రముఖ తారాగణం మరియు సిబ్బంది పని చేస్తున్నారు. ఈ పాన్-ఇండియన్ చిత్రానికి థమన్ సంగీత దర్శకుడు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement