Friday, May 3, 2024

క్రిష్4లో హృతిక్ సాంగ్..యాక్టింగ్ కి 15ఏళ్ళు..

టాలీవుడ్ మాటేమో గాని బాలీవుడ్ లోకి అడుగుపెట్టి అక్క‌డ నిల‌దొక్కుకోవ‌డం అంత ఈజీ కాద‌నే మాట అంద‌రికీ తెలిసిందే.అయితే హీరో హృతిక్ రోషన్ ను ఫ‌స్ట్ టైం తెరపై చూసిన వాళ్లు హాలీవుడ్ హీరో అదుపుతప్పి బాలీవుడ్ కి వచ్చాడేమో అనుకున్నారు. అప్పటివరకూ హీరో సల్మాన్ ఖాన్ కండల గురించే మాట్లాడుకుంటూ వచ్చిన ప్రేక్షకులు హృతిక్ కండలు చూసి నివ్వెరపోయారు.. తొలి సినిమాతోనే కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు హృతిక్. ఆ హ‌వాని ఇప్ప‌టికీ కొన‌సాగిస్తూనే ఉన్నాడు.

ఇక హృతిక్ రోష‌న్ హీరోగా క్రిష్ చిత్రం సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. హృతిక్ క్రేజ్ ను .. ఆకాశమే హద్దుగా పెంచేసింది. మధ్య మధ్యలో మిగతా సినిమాలు చేసినా ‘క్రిష్’ సిరీస్ లో వచ్చిన సినిమాలు ఆయనను ఎవరెస్టు ఎత్తులో నిలబెట్టాయి. ఇప్ప‌టికే క్రిష్ నుండి మూడు సిరీస్ లు ప్రేక్ష‌కుల‌ను అల‌రించాయి. ఈ నేప‌థ్యంలో క్రిష్4 కూడా రానుంది. హృతిక్ రోషన్ నటుడిగా 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ఇన్ స్టాలో “ఇది గతం .. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం” అని తెలిపారు.

కాగా ‘క్రిష్ 4’కి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయ‌ని స్ప‌ష్టం చేశారు. తాజా ఇంటర్వ్యూలో హృతిక్ తండ్రి రాకేశ్ రోషన్ మాట్లాడుతూ .. “ప్రస్తుతం ‘క్రిష్ 4’ కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాలో హృతిక్ ఒక పాట కూడా పాడనున్నాడని చెప్పారు. ఇక ‘క్రిష్ 4’ వసూళ్ల పరంగా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. అయితే ఇన్నాళ్లు హృతిక్ యాక్టింగ్ ని ఎంజాయ్ చేసిన ప్రేక్ష‌కులు ఇక‌పై ఆయ‌న గాత్రాన్ని విన‌నున్నార‌న్న‌మాట‌. ఇది హృతిక్ ఫ్యాన్స్ కి పండ‌గేన‌ని చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement