Saturday, April 27, 2024

హాట్ గా అన‌సూయ‌.. విమానం మూవీ నుండి పోస్ట‌ర్.. గ్లింప్స్

అన‌సూయ యాంక‌రింగ్ మానేసి పూర్తి దృష్టిని సినిమాల‌పైనే పెట్టింది. కాగా ఆమె న‌టిస్తున్న తాజా చిత్రం విమానం.ఈ మూవీ నుండి అన‌సూయ గ్లింప్స్.. పోస్ట‌ర్ రిలీజ్ చేశారు మేక‌ర్స్. జీ స్టూడియోస్ – కిరణ్ కొర్రపాటి నిర్మించిన ఈ సినిమాకి, శివప్రసాద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అనసూయ గ్రామీణ యువతిగా కనిపించనుంది .. ఆమె పాత్ర పేరు సుమతి. కాగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్ లో అన‌సూయ హాట్ గా కనిపిస్తోంది. ఆమె పాత్ర చాలా బోల్డ్ గా ఉండనుందనే విషయం పోస్టర్ చూస్తేనే అర్థమైపోతోంది. ఇది తండ్రీ కొడుకుల అనుబంధం ప్రధానంగా సాగే కథ. తండ్రిగా వీరయ్య పాత్రలో సముద్రఖని కనిపించనున్నాడు. ఆయన కొడుకు పాత్రను మాస్టర్ ధృవన్ పోషించాడు. రాజేంద్రన్ మరో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. చరణ్ అర్జున్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, తెలుగు .. తమిళ భాషల్లో జూన్ 9వ తేదీన విడుదల చేయనున్నారు.అనసూయ భరద్వాజ్ విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను చేసుకుంటూ వెళుతోంది. ప్రస్తుతం ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement