Thursday, May 16, 2024

విశాల్ 34పోస్ట‌ర్ రిలీజ్

త‌మిళ హీరో విశాల్ త‌న నెక్ట్స్ చిత్రం అప్ డేట్ ఇచ్చాడు. హరి దర్శకత్వంలో కొత్త సినిమాకు సంతకం చేశారు. విశాల్ 34వ సినిమా పూజా కార్యక్రమాలతో షురూ అయింది. విశాల్‌ 34గా వస్తున్న ఈ చిత్రం అనౌన్స్ మెంట్‌ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. చుట్టూ గన్స్‌, కత్తులు కనిపిస్తుండగా.. మధ్యలో స్టెతస్కోప్‌ చూడొచ్చు. విశాల్ ఇందులో డాక్టర్‌గా కనిపించబోతున్నట్టు తాజా లుక్‌తో అర్థమవుతోంది. మాస్‌ యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో తాజా ప్రాజెక్ట్‌ ఉండబోతున్నట్టు హింట్‌ ఇచ్చేశాడు డైరెక్టర్ హరి. భరణి, పూజ సినిమాల తర్వాత విశాల్‌ నటిస్తోన్న మూడో సినిమా కావడం విశేషం.ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్‌లో ఎవరు కనిపించబోతున్నారు.. ఇతర నటీనటులెవరనే దానిపై రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది. స్టోన్ బెంచ్‌ ఫిలిమ్స్‌-జీ స్టూడియోస్‌ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ షురూ కానుంది.గతేడాది లాఠీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు విశాల్ . పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయింది. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు విశాల్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement