Friday, May 17, 2024

AMB సినిమాస్‌ తరహాలో AVD సినిమాస్

టాలీవుడ్‌లో బిజినెస్ రంగంలో దూసుకుపోయే పలువురు హీరోలు కూడా ఉన్నారు. వారిలో ప్రిన్స్ మహేష్‌బాబు ఇప్పటికే మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో AMB సినిమాస్‌ మహేష్‌బాబుదే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదే బాటలో థియేటర్ బిజినెస్‌లోకి యువ హీరో విజయ్ దేవరకొండ అడుగు పెడుతున్నాడు. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్.

మహేష్ బాబు -ఏషియన్ సినిమాస్ సంయుక్తంగా ప్రారంభించిన AMB సినిమాస్ పెద్ద విజయం సాధించింది. దీంతో అల్లు అర్జున్‌తో కలిసి ఏషియన్ సినిమాస్ మల్టీప్లెక్సులను నిర్మిస్తోంది. అమీర్‌పేటలోని సత్యం థియేటర్‌ను సొంతం చేసుకుని అక్కడ పాత బిల్డింగ్ స్థానంలో కొత్త మల్టీప్లెక్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు విజయ్ దేవరకొండతో కలిసి ఏషియన్ సినిమాస్ మూడు తెరల మల్టీప్లెక్స్ నిర్మిస్తోంది. విజయ్ స్వస్థలమైన మహబూబ్ నగర్‌లో గతంలోని తిరుమల థియేటర్ ప్రాంగణంలో నిర్మితమవుతున్న ఈ కొత్త మల్టీప్లెక్స్‌కు AVD (ఏషియన్ విజయ్ దేవరకొండ) సినిమాస్ అని నామకరణం చేశారు. ఈ ఏడాది వేసవిలో ‘వకీల్ సాబ్’ సినిమాతో ఏవీడీ సినిమాస్ ఘనమైన లాంచింగ్‌కు రెడీ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement