Thursday, May 2, 2024

ఆక‌ట్టుకుంటోన్న ‘అర్జున ఫ‌ల్గుణ’ టీజ‌ర్..

డిఫ‌రెంట్ క‌థ‌ల‌ను ఎంచుకోవ‌డంలో ముందుంటాడు యంగ్ హీరో శ్రీ విష్ణు. ప్రస్తుతం ఆయ‌న‌ నటిస్తున్న సినిమా అర్జున ఫల్గుణ. ఘాజీ, క్షణం, వైల్డ్‌ డాగ్‌ తదితర విజయ వంతమైన సినిమాలను రూపొందించిన మ్యాట్నీ ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ బ్యానర్ పై ఈ సినిమా ను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కు తేజా మార్ని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీ విష్ణుకు జోడీగా అమృతా అయ్యర్‌ నటిస్తుండగా… ఇతర ప్రధాన పాత్రల్లో నరేశ్‌, శివాజీ రాజా, సుబ్బరాజు, దేవీ ప్రసాద్‌ , జబర్దస్త్‌ మహేశ్‌, రాజ్‌ కుమార్‌ చౌదరి, చైతన్య నటిస్తున్నారు. అయితే.. తాజాగా ఈ సినిమా టీజర్‌ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ టీజర్‌ అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement