Friday, May 3, 2024

ఎన్టీఆర్ డ్యాన్స్ ని క‌న్నార్ప‌కుండా చూస్తా.. రంభ‌

తాన‌కి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌ట‌న అంటే చాలా ఇష్ట‌మ‌ని నటి రంభ తెలిపింది. తాను చేసిన ఐటమ్ సాంగ్స్ లో నాచోరే నాచోరే సాంగ్ అంటే ఇష్టమనిఅన్నారు. ఎన్టీఆర్ డాన్స్ చేస్తే కన్నార్పకుండా చూస్తామని.. ఎన్టీఆర్ డెడికేషన్ చూస్తే పిచ్చెక్కుతుందని నా దృష్టిలో మైకేల్ జాక్సన్ కన్నా తారక్ బెస్ట్ డాన్సర్ అని చెప్పుకొచ్చారు రంభ. అలాగే కొరియోగ్రాఫర్ గా ప్రభుదేవా అంటే ఇష్టమని రంభ అన్నారు. టాలీవుడ్ లో బెస్ట్ డాన్సర్ ఎవరు అంటే చాలా మంది టక్కున చెప్పే పేరు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్. ఆయ‌న డాన్స్ గురించి ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు ప్రశంసించారు. తాజాగా నటి రంభ కూడా తారక్ డాన్స్ పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఒకప్పుడు క్రేజీ హీరోయిన్ గా రంభకు మంచి పేరు ఉంది. అప్పట్లో తన గ్లామర్ తో కుర్రకారును ఆకట్టుకుంది ఈ చిన్నది. ఆ తర్వాత పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది. పెళ్లి తర్వాత కూడా పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..స్టార్ హీరోలు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లతో సినిమా చేయాలనీ ఉందని తెలిపింది. అలాగే తనకు హీరోయిన్ త్రిష అంటే ఇష్టమని ఆమె ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతుందని తెలిపారు రంభ.

Advertisement

తాజా వార్తలు

Advertisement