Thursday, April 25, 2024

హీరో చిత్రంపై ‘రామ్ చ‌ర‌ణ్’ ప్ర‌శంస‌లు

హీరో చిత్రం చాలా బాగుంద‌ని ప్ర‌శంస‌లు కురిపించాడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్. ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ లోకి గ‌ల్లా అశోక్ కి అమేజింగ్ ఎంట్రీ ల‌భించింద‌ని అన్నాడు. ఈ సినిమాని చూస్తూ తాను చాలా ఎంజాయ్ చేశాన‌ని చెప్పాడు. ఈ మేర‌కు గల్లా జయదేవ్ , గల్లా పద్మావతి , డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య, మొత్తం టీమ్ కు శుభాకాంక్షలు. మీ అన్ని ప్రయత్నాల్లో విజయం సాధించాలి’ అని ట్వీట్ చేశాడు. సూపర్ స్టార్ కృష్ణ ఇంటి నుంచి మరో వారసుడు సినీ రంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. కృష్ణ మనవడు, మహేశ్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ ‘హీరో’ చిత్రం ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్. ‘హీరో’ చిత్రంలో అశోక్ సరసర అందాల భామ నిధి అగర్వాల్ నటించింది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం… సంక్రాంతి సందర్భంగా విడుదలైంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement