Monday, May 6, 2024

‘సర్దార్’గా కార్తీ.. ఫస్ట్ లుక్ వచ్చేసింది

ఇటీవల ‘సుల్తాన్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన తమిళ యంగ్ హీరో కార్తీ మరో కొత్త సినిమాతో తన అభిమానులను అలరించడానికి సిద్ధమయ్యాడు. ఈ మేరకు ‘సర్దార్’ సినిమాలో కార్తీ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో గుబురు గడ్డంతో కార్తీ అదరగొట్టాడు. ఈ లుక్ చిత్రంపై అంచనాలు పెంచుతోంది. ఈ సినిమాకు పీఎస్ మిత్రన్ డైరెక్టర్. రాశీ ఖన్నా, రాజీషా విజయన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. కాగా డైరెక్టర్ మిత్రన్ గతంలో విశాల్ హీరోగా ‘అభిమన్యుడు’ మూవీని తెరకెక్కించి హిట్ కొట్టాడు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement