Thursday, April 25, 2024

‘దుల్క‌ర్ స‌ల్మాన్’ కి క‌రోనా

సినీ సెల‌బ్రిటీలు వ‌రుస‌గా క‌రోనా బారిన ప‌డుతున్నారు. కాగా రీసెంట్ గా దుల్క‌ర్ స‌ల్మాన్ క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న ప్ర‌క‌టించాడు. ‘నాకు కోవిడ్ పాజిటివ్ గా నిర్దారణ అయింది. కొద్దిగా జ్వరం, స్పల్ప లక్షణాలు ఉన్నాయి. అవి తప్ప నేను బాగానే ఉన్నాను. గత కొన్ని రోజులుగా నాతో షూటింగ్ లో కాంటాక్ట్ లో ఉన్న వారు వెంటనే టెస్ట్ చేయించుకోండి. లక్షణాలు కనిపిస్తే ఐసొలేషన్ లో ఉండండి. ఈ పాండమిక్ ఇంకా ముగియలేదు. కాబట్టి అందరం అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించండి అంటూ దుల్కర్ సల్మాన్ విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా దుల్కర్ సల్మాన్ చివరగా కురుప్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరోగా ఈ చిత్రంలో దుల్కర్ తన నటనతో అదరగొట్టాడు. దుల్కర్ పెర్ఫామెన్స్ కు ప్రశంసలు దక్కాయి. ఇప్పుడిప్పుడే దుల్కర్ తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువవుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement