Saturday, April 20, 2024

ఎంజీఎం హాస్ప‌ట‌ల్ లో కోవిడ్ పేషెంట్ల‌ను ప‌రామ‌ర్శించిన ‘రాజ‌నాల శ్రీహ‌రి’

మాజీ శాప్ డైరెక్టర్ & తెరాస రాష్ట్ర నాయకులు రాజనాల శ్రీహరి ఎంజీఎం హాస్పిటల్ కు వెళ్లి 40 మంది కోవిడ్ వ్యాధిగ్రస్తులను పరామర్శించి మనోధైర్యం కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న మందులను సకాలంలో వేసుకోవాలని ,ఎవరు అధైర్య పడొద్ద‌ని, మనస్థాపానికి గురి కావద్దని , కోవిడ్ వల్ల ఏం జరగదు అని వ్యాధిగ్రస్తులకు తెలిపారు. అనంతరం ఆయ‌న మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ , మంత్రి కేటీఆర్, అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సూచన మేరకు ఎంజీఎం హాస్పిటల్ లో సుమారు 40 మంది కరోనా వ్యాధిగ్రస్తులను కలిసి వారి మనోధైర్యం కల్పించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ హాస్పిటల్ కు ధీటుగా గవర్నమెంట్ హాస్పిటల్ కరోనా వ్యాధి గ్రస్తులకు ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసి చికిత్సను అందిస్తుంద‌న్నారు. అలాగే ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరాన్ని పాటించాల‌న్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement