Wednesday, May 1, 2024

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ గ్లింప్ పై.. రామ్ చ‌ర‌ణ్ ప్ర‌శంస‌లు

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ మాస్ గ్లింప్ త‌న‌కి తెగ న‌చ్చింద‌ని ట్వీట్ చేశాడు. గబ్బర్ సింగ్ విడుదలై 11 ఏళ్లు అయిన సందర్భంగా గురువారం పవన్ పోస్టర్, ఫస్ట్ గ్లింప్స్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో పవన్ పెర్ఫామెన్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. టాలీవుడ్ ప్రముఖులు కూడా అద్భుతంగా ఉందని కితాబిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం గ్లింప్స్ సూపర్ అంటూ ట్వీట్ చేశారు. ఈ మాస్ గ్లింప్స్ నాకు తెగ నచ్చేసింది. ఈ మాస్ ఎంటర్ టైనర్ ను థియేటర్లలో చూసేందుకు వేచి ఉండలేను’ అని ట్వీట్ చేశారు. బాబాయ్ సినిమాకు సపోర్ట్ గా చెర్రీ ట్వీట్ చేయడంతో మెగా ఫ్యాన్స్ మరింత ఖుషీ అవుతున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్నారు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌. కాగా పవన్ సరసన యువ నటి శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మాస్ ఎంటర్ టైనర్ చిత్రంలో పవన్ పవర్ పుల్ పోలీసాఫీర్ పాత్రలో నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement