Tuesday, April 30, 2024

‘లియో’ సినిమా టిక్కెట్లకు ఫుల్ డిమాండ్.. అక్క‌డ 2000కు పైగానే!

తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి లేటెస్ట్ అప్ క‌మింగ్ యాక్షన్ మూవీ ‘లియో. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ ద‌సారా సందర్భంగా ఈ నెల 19న ఈ సినిమా రిలీజ్ కు రేడీ ఉంది. ఇక ఇప్ప‌టికే బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు. అయితే, బెంగళూరులోని పీవీఆర్ నెక్సస్ మాల్ (PVR Nexus Bengaluru)లో లియో సినిమా టికెట్ రేటు చూస్తే షాక్ అవ్వాల్సిందే.. మామూలుగా మల్టీప్లెక్స్ స్క్రీన్లలో రూ.150 నుంచి రూ.250 లేదా రూ.300 ఉంటుంది.

కానీ, బెంగ‌ళూరులోని పీవీఆర్ నెక్సస్ మాల్ లోని ఐమ్యాక్స్ స్క్రీన్ మీద ‘లియో’ సినిమా చూడాలంటే రూ.2300 లేదా రూ.2500 రేటు పెట్టి టికెట్ కొనాలి. బెంగళూరులోని కొన్ని మల్టీప్లెక్స్ స్క్రీన్లలో ‘లియో’ మార్నింగ్ షో టికెట్ రేట్లు రూ.1000 ఉన్నాయి. అది మినిమమ్ రేటు! ఢిల్లీతో పాటు కొన్ని ఏరియాలలో ‘లియో’ టికెట్ రేట్లు రూ.700 నుంచి రూ.1000 వరకు ఉన్నాయి. ఇక ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని మల్టీప్లెక్స్ స్క్రీన్లలో ‘లియో’ టికెట్ రేట్లు రూ.295 గా ఉన్నాయి.

‘లియోస మూవీని సెవెన్ స్కీన్స్ పతాకంపై ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీష్ పళానిసామి నిర్మించారు. ఇందులో విజయ్ జోడీగా త్రిష నటించ‌గా.. ప్రియా ఆనంద్ కీలక పాత్రలో న‌టించారు. అలాగే, సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్, తమిళ దర్శకులు గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, నటుడు మన్సూర్ అలీ ఖాన్, మలయాళ నటుడు మాథ్యూ తదితరులు ఉన్నారు. తెలుగులో ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీత దర్శకుడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement