Sunday, April 28, 2024

Dootha | ఎట్టకేలకు రిలీజ్ డేట్ వచ్చేసింది.. 8 ఎపిసోడ్‌లతో నాగచైతన్య ‘దూత’ !

అమెజాన్ ప్రైమ్ వీడియో నిర్మించిన మొట్టమొదటి తెలుగు సిరీస్‌ ‘దూత’. ఈ వెబ్‌సిరీస్ తోనే నాగచైతన్య ఓటీటీలో అరంగేట్రం చేశాడు. అయితే ఈ సిరీస్ ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల వాయిదా పడుతూ వస్తోంది. కాగా, విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించిన హార్రర్ డ్రామా వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ ఖరారైంది.

కాగా, ఈ సిరీస్ డిసెంబర్ 1 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్టు తెలుస్తొంది. మొత్తం 8 ఎపిసోడ్‌లుగా ఈ సిరీస్ రానుందట. ఒక్కో ఎపిసోడ్ 40 నిమిషాల నిడివితో ఉంటుందని సమాచారం. ఈ వెబ్ సిరీస్‌ను దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్‌తో ప్రైమ్ వీడియోతో కలిసి శరద్ మరార్ నిర్మించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement