Saturday, April 20, 2024

దిల్ రాజు ఫ్యామిలీ హీరో వచ్చేస్తున్నాడు – రేపే ముహూర్తం

సినీ ఇండస్ట్రీలోకి చాలా మంది హీరోలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. అందులో కొంతమంది మాత్రమే నిలదొక్కుకొని స్టార్స్ అవుతూ ఉంటారు. ఇక మామూలుగా హీరోల కొడుకులు హీరోలు అవటం మనం చూస్తూనే ఉన్నాం. అలాగే దర్శకులు కొడుకులు కూడా హీరోలుగా ఎంట్రీ ఇస్తున్నారు. మరోవైపు నిర్మాతల కొడుకులు కూడా చాలామంది ఇప్పటికే ఎంట్రీ ఇచ్చినప్పటికీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మినహా మిగిలిన వారు ఎవరూ కనిపించడం లేదు.

అయితే దిల్ రాజు కుటుంబం నుంచి కూడా ఓ హీరో వస్తున్నాడని ఇదివరకే ప్రచారం జరిగింది. కాగా ఈ నెల 8 న దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ తొలి చిత్రం ఇంట్రడక్షన్ వీడియో ని విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి ‘రౌడీ బాయ్స్’ అనే టైటిల్ ను పెట్టారు. అలాగే ఈ సినిమాలో టాలెంటెడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. హుషారు ఫేమ్ హర్ష దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇదిలా ఉండగా హుషారు సినిమా తో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హర్ష ఇప్పుడుఆశిష్ రెడ్డినిఏవిధంగాచూపించబోతున్నాడనేది అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. కామెడీ తో కూడిన లవ్ స్టోరీ గా ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాను దిల్ రాజు, సిరీస్ లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement