Friday, May 3, 2024

జానపద గేయం తో అదరగొట్టిన నాగ శౌర్య @వరుడు కావలెను

లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా వరుడు కావలెను. సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్, టీజర్ తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇక తాజాగా ఈ సినిమా నుంచి దిగు దిగు దిగు నాగ అంటూ సాగే పాట రిలీజ్ అయింది.ఈ పాటకు తమన్ సంగీతం అందించగా అనంత్ శ్రీరామ్ పాట రాశారు. అలాగే శ్రేయ గోషల్ పాడారు. ఇది ఒక పాపులర్ జానపద గేయం. ఇటీవల శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ సినిమాలో సరంగదరియా జానపద గేయం తో రికార్డుల మోత మోగించిన సంగతి తెలిసిందే.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement