Saturday, June 29, 2024

Raayan | ధనుష్ ‘రాయన్’ రిలీజ్ డేట్ ఫిక్స్..

ధ‌నుష్ స్వ‌యం ధర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘రాయన్’. ఈ సినిమాలో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ మరో లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. కాళిదాస్ జయరామ్‌ మరో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కాగా, ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు మేకర్స్. వ‌చ్చే నెల (జులై) 26న ఈ మూవీ థియేటర్స్ లో విడుదల కానుంది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి తెలుగు వెర్షన్‌ను గ్రాండ్ గా విడుదల చేయనుంది. ఫస్ట్ క్లాస్ ప్రొడక్షన్ స్టాండర్డ్స్ తో రూపొందుతున్న ఈ సినిమాలో ఎస్.జె.సూర్య, సెల్వరాఘవన్, అపర్ణ బాలమురళి, దుషార విజయన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement