Sunday, April 28, 2024

హీరో నిఖిల్ ను సత్కరించిన సీపీ సజ్జనార్

యంగ్ హీరో నిఖిల్ కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఎంతోమంది పేద ప్రజలకు సహాయం చేశారు. ఆక్సిజన్ సిలిండర్స్, కాన్సంట్రేటర్లు ఇలా చాలా మంది పేద వారికి అవసరమైనవి అందించారు. సహాయం అని ఎవరు ట్వీట్ చేసిన తన వంతు సహాయ సహకారాలు అందించారు.

ఈ నేపథ్యంలోనే సీపీ సజ్జనార్ నిఖిల్ పై ప్రశంసలు కురిపించారు. నిఖిల్ ను సత్కరించారు. అనంతరం నిఖిల్ తో సరదాగా మాట్లాడారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయాని కొస్తే నిఖిల్ 18 పేజెస్ సినిమాతో పాటు… చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ 2 సినిమాలు చేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement