Friday, May 3, 2024

అందం పెరగడానికి కరోనా హెల్ప్ చేస్తుందంటున్న రష్మిక !!

ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైంది రష్మిక మందన్న. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో వరుస అవకాశాలు ఈ అమ్మడి తలుపు తట్టాయి. ఇక అక్కడి నుంచి కూడా వరుసగా హిట్ సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోయిన్ గా నిలదొక్కుకుంది. గతేడాది భీష్మ, సరిలేరు నీకెవ్వరు వంటి చిత్రాలు తో తో హిట్ కొట్టిన రష్మిక ప్రస్తుతం పుష్ప సినిమా చేస్తోంది.

ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మిక లైవ్ లో నెటిజన్స్ తో ముచ్చటించింది. కరోనా కారణంగా బయటకు వెళ్లడం బాగా తగ్గింది. దాని వల్ల మేకప్ వేయడం లేదు. దాంతో ఫేస్ లో గ్లో పెరిగి గ్లామర్ గా కనబడుతున్నానని చెప్పుకొచ్చింది. తన గ్లామర్ పెరిగేందుకు ఇండైరెక్ట్ గా కరోనా సాయం చేసిందని చెప్పుకొచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement