Saturday, July 27, 2024

7డేస్ 6 నైట్స్ షూటింగ్ కి శుభం కార్డ్

డర్టీ హరి సినిమాతో దర్శకుడిగా సక్సెస్ ని అందుకున్నాడు నిర్మాత ఎం.ఎస్.రాజు. ఎం.ఎస్.రాజు ప్రస్తుతం 7 డేస్ 6 నైట్స్ పేరుతో సినిమా చేస్తున్నాడు. అయితే సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వింటేజ్ పిక్చర్ ఏబిజీ క్రియేషన్స్ పతాకం మీద సుమంత్ అశ్విన్, రజినీకాంత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాతో ఎమ్ ఎస్ రాజు కొడుకు సుమంత్ అశ్విన్ నిర్మాతగా పరిచయం కాబోతున్నాడు.

అలాగే మెహర్ చావల్ అనే కొత్తమ్మాయి హీరోయిన్ గా నటిస్తున్నారు. వీరిద్దరితో పాటు రోహన్, కృతికా శెట్టి మరో జంటగా చేస్తున్నారు. ఈ నలుగురే కాకుండా సుష్మ, రిషికా బాలి ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉండగా… తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత అత్యంత వేగంగా షూటింగ్ ను కంప్లీట్ చేశారు. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement