Friday, March 29, 2024

అలర్ట్: మూడు రోజుల పాటు భారీ వర్షాలు..

ఏపీలో రాగల మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో ఉత్తర, దక్షిణ కోస్తాలతో పాటు రాయలసీమలో కొన్నిచోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ బెంగాల్ కోస్తా తీరానికి దగ్గరగా వాయువ్య బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 3.1 km ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణం వైపు వంగి ఉన్నది. దీని ప్రభావం వలన రేపు(28.08.2021) ఉదయం నకు వాయువ్య & దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.13°N అక్షాంశము వెంబడి తూర్పు-పడమర ‘షీర్ జోన్’ సగటు సముద్ర మట్టానికి 4.5 km నుండి 7.6 km ఎత్తుల మధ్య కొనసాగుతూ, ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణం వైపు వంగి ఉన్నది. దీంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఇక తెలంగాణలోనూ మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల రెండు రోజులు తెలంగాణలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోకి పశ్చిమ, నైరుతి నుంచి కిందిస్థాయి గాలులు వీస్తున్నాయని తెలిపింది. నేడు(గురువారం), రేపు(శుక్రవారం) తేటికపాటి నుంచి మోస్తరు వానలు పడుతాయని, శనివారం పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. రెండు రోజుల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వానలు కురుస్తాయని చెప్పింది.  వీటి ప్రభావం వలన రెండు తెలుగు రాష్ట్రాల్లో రాగల మూడు రోజుల వర్షాలు ఉన్నట్లు పేర్కొంది. ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

ఇది కూడా చదవండి: బోర్డింగ్‌ స్కూల్‌లో 26 మంది విద్యార్థులకు కరోనా

Advertisement

తాజా వార్తలు

Advertisement