Wednesday, May 1, 2024

సిటాడెల్ వెబ్ సిరీస్.. ఇంగ్లీష్ లో ప్రియాంక‌.. హిందీలో స‌మంత‌

హాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ లో న‌టిస్తోంది గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక‌చోప్రా. కాగా సిటాడెల్ ను బాలీవుడ్ లోనూ తెరకెక్కిస్తున్నారు. ఒరిజనల్ వెర్షన్ కు కొన్ని మార్పులు చేసి అదే పేరుతో చిత్రీకరిస్తున్నారు. హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా పోషించిన పాత్రను బాలీవుడ్ సిటాడెల్ లో సమంత పోషిస్తోంది. అందుకోసం సమంత మార్షల్ ఆర్ట్స్ లోనూ ట్రైనింగ్ పొందింది. ఇటీవల సమంత గాయపడింది ఈ వెబ్ సిరీస్ షూటింగ్ లోనే. ఇందులో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కూడా నటిస్తున్నాడు.
దీనిపై ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా స్పందించింది. సమంత, వరుణ్ ధావన్ లు ఈ వెబ్ సిరీస్ లో ఎలా నటించాలని తాను చెప్పబోనని, వాళ్లిద్దరూ ఉన్నతస్థాయి నటులని కొనియాడింది. సిటాడెల్ చిత్రీకరణ గొప్పగా సాగుతోందని వరుణ్ ధావన్ చెప్పాడని ప్రియాంక చోప్రా వెల్లడించింది. రాజ్-డీకే ఎంతో టాలెంట్ ఉన్న దర్శకులని, సిటాడెల్ భారతీయ వెర్షన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement