Sunday, April 21, 2024

CCL 2024 | ఒకటో తేదీ నుంచి ఉప్పల్ స్టేడియంలో సినీ సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌…

హైద‌రాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో వ‌చ్చే నెల 1 నుంచి 3 వ‌ర‌కు రెండో దశ సెలబ్రెటీ క్రికెట్ లీగ్ పోటీలు జరగనున్నాయి. సీసీఎల్ తొలి దశ మ్యాచ్‌లు షార్జాలో జ‌రుగుతున్నాయి. కాగా, హైద‌రాబాద్‌లో జరిగే మ్యాచ్‌లకు సంబంధించిన‌ ఏర్పాట్లు జరుగుతున్న‌ట్టు హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ హెచ్‌సీఏ అధ్య‌క్షుడు అర్శ‌న‌ప‌ల్లి జ‌గ‌న్‌మోహ‌న్ రావు తెలిపారు. హైద‌రాబాద్‌లో 6 మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. రోజుకు రెండు మ్యాచ్‌లు చొప్ప‌న 3 రోజులు 6 మ్యాచ్‌లు నిర్వ‌హిస్తున్నారు.. హీరో అక్కినేని అఖిల్ సారథ్యంలోని టాలీవుడ్ టీమ్ తెలుగు వారియ‌ర్స్ బరిలోకి దిగనుంది. ఇక తెలంగాణలోని కాలేజీ విద్యార్థుల‌కు ఉచితంగా సీసీఎల్ చూసే అవకాశం కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు.

రోజుకు ప‌ది వేల మంది ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజ‌నీరింగ్‌, మెడిక‌ల్‌ విద్యార్థుల‌ను స్టేడియంలోకి ఉచితంగా అనుమ‌తిస్తామ‌ని తెలిపారు. ఆయా కాలేజీ ప్రిన్సిపాల్స్ హెచ్‌సీఏ ఈమెయిల్ ‌[email protected]కు త‌మ విద్యాసంస్థ‌ల నుంచి ఎంత మంది వ‌స్తున్నారో విద్యార్థుల పేర్ల‌తో స‌హా ఈమెయిల్ చేయాల‌ని సూచించారు.

పాల్గొనే ఇతర జట్లు..

ముంబై హీరోస్‌
కేర‌ళ స్ట్ర‌యిక‌ర్స్‌
భోజ్‌పురి ద‌బాంగ్స్‌
బెంగాల్ టైగ‌ర్స్‌
చెన్నై రైనోస్‌
క‌ర్ణాట‌క బుల్డోజ‌ర్స్‌
పంజాబ్ డి షేర్

Advertisement

తాజా వార్తలు

Advertisement