Saturday, September 21, 2024

హనుమాన్ మనవాడే… చిరంజీవి ట్వీట్ వైరల్

మెగాస్టార్ చిరంజీవి హనుమాన్ భక్తుడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే హనుమాన్ జయంతి సందర్భంగా చిరంజీవి ఓ ఆసక్తికరమైన ట్వీట్ ని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం ఏంటంటే గత కొంత కాలంగా గా హనుమంతుడి జన్మ స్థానం, ఆయన ఎక్కడ జన్మించాడు… అని చర్చ నడుస్తోంది. కాగా హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రి పైన ఉన్న జాబాలి తీర్థం అని తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ తెలిపింది. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని స్పష్టం చేసింది.

ఇక ఇదే ఇదే విషయంపై మాట్లాడుతూ చిరంజీవి ట్వీట్ చేశారు. అందరికి హనుమజ్జయంతి శుభాకాంక్షలు.ఈ హనుమజ్జయంతికి ఓ ప్రత్యేకత ఉంది.హనుమాన్ మనవాడే అని.. మన తిరుమల కొండల్లోనే జన్మించాడని ఆధారాలతో సహా తిరుమల తిరుపతి దేవస్థానం రుజువు చేసింది. ఎక్కడివాడు.. ఎప్పటివాడు.. అన్న విషయం పక్కనపెడితే మన గుండెలో కొలువైన సూపర్‌మ్యాన్ హనుమాన్… అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement