Wednesday, May 1, 2024

1Crore | రీ-రిలీజ్ లో బిజినెస్‌మ్యాన్ ఆల్ టైమ్ రికార్డ్..

మహేష్ బాబు యాక్షన్ రోల్ లో అలరించిన సినిమాలు చాలా తక్కువ.. అలా మ‌హేష్ బాబు మాస్ యాక్ష‌న్ & గ్యాంగ్‌స్టర్‌ రోల్ లో అల‌రించి అద్భుతమైన సినిమా బిజినెస్‌మ్యాన్. 2012లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. 2012లో అత్యధిక వసూళ్లు రాబ‌ట్టిన‌ తెలుగు సినిమాల‌లో ఒకటిగా నిలిచి బ్లాక్‌బస్టర్‌గా హిట్ కొట్టింది.

కాగా, ఈ నెల (ఆగస్టు) 9న మహేష్ బాబు తన పుట్టినరోజును జరుపుకోనుండ‌గా.. ఈ సంవత్సరం అభిమానులకు బ‌ర్త్ డే గిఫ్ట్ గా బిజినెస్‌మ్యాన్ మూవీని రీ-రిలీజ్ చేయ‌నున్నారు మేక‌ర్స్. ఈ కల్ట్ క్లాసిక్ మూవీ 4Kలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ వేడుక‌ల్లో భాగంగా ఈ సినిమా ఇప్పుడు రీ-రిలీజ్ ట్రెండ్‌లో మ‌రో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.

రీసెంట్ గా బిజినెస్ మ్యాన్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్‌లో కోటి ఫస్ట్ సినిమాగా ఈ మూవీ నిలిచింది. ఈ కోటి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా కేవ‌లం హైద‌రాబాద్ లోనివే అని తెలుస్తోంది. దీంతో మార్కెట్ లో మహేష్ బాబు అతని సినిమాల పట్ల ఎంత డిమాండ్ ఉందో అర్థంఅవుతోంది.

- Advertisement -

మరోవైపు, మహేష్ బాబు ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. గతంలో బిజినెస్‌మెన్‌తో సహా మహేష్ బాబు కోసం కొన్ని బ్లాక్‌బస్టర్‌లను కంపోజ్ చేసిన ఎస్ థమన్ గుంటూరు కారం చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement