Thursday, July 25, 2024

Bommarillu | రీ-రిలీజ్ కి “బొమ్మరిల్లు” రెడీ !

డైరెక్టర్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన సిద్దార్థ్ ప్రధాన పాత్రలో తెర‌కెక్కిన మూవీ ‘బొమ్మరిల్లు’. ఈ మూవీ 2006 లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. ఇక, ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుండటంతో.. ఈ సినిమా కూడా మరో సారి బిగ్ స్క్రీల్‌పైకి వచ్చేందుకు రెడీ అయ్యింది. ఏప్రిల్ నెలలో హీరో సిద్దార్థ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

మరి ఈ ఆల్ టైమ్ సూపర్ హిట్ మూవీ అయిన బొమ్మరిల్లు ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి. ఈ సినిమాలో జెనీలియా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో జయసుధ, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఆల్ టైమ్ హిట్ ఆల్బమ్‌గా మిగిలిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement