Friday, May 17, 2024

ర‌వితేజ మూవీలో బాలీవుడ్ న‌టుడు.. స్పెషల్ క్యారెక్ట‌ర్ ఇదే అంటున్న డైరెక్ట‌ర్!

టాలీవుడ్ అగ్రనటుడు రవితేజతో వంశీ డైరెక్ట్ చేస్తున్న సినిమా టైగ‌ర్ నాగేశ్వరరావు.. 1970 లలో పేరుమోసిన దొంగ జీవిత కథ ఆధారంగా తెర‌కెక్కున్న మూవీ ఇది. ఈ సినిమాలో బాలీవుడ్ యువ నటి నుపుర్ సనన్ కథానాయికగా నటిస్తోంది. అభిషేక్ అగర్వాల్ తన హోమ్ బ్యానర్ అభిషేక్ ఆర్ట్స్ పై తేజ్ నారాయణ్‌తో కలిసి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే ప్రారంభం కాగా, చిత్ర దర్శకుడు వంశీ మీడియాతో మాట్లాడుతూ.. కార్తికేయ 2 సినిమాలో చిన్న పాత్రలో నటించిన బాలీవుడ్ అగ్ర నటుడు అనుపమ్ ఖేర్ ఈ సినిమాలో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పాత్రను పోషించబోతున్నట్లు వెల్లడించారు.

ఇది చాలా కీలకమైన పాత్ర అని, ఈ క్యారెక్ట‌ర్ సినిమా అంతటా ఉంటుందిన్నారు. టైగర్ జీవితంలో కీలక పాత్ర పోషించే వ్యక్తి.. అతను ఢిల్లీకి చెందిన IB (ఇంటెలిజెన్స్ బ్యూరో) ఆఫీసర్‌గా అనుప‌మ్ ఖేర్‌ నటిస్తున్నాడని వంశీ వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement