Monday, April 29, 2024

పవన్ హీరోయిన్ పై బీజేపీ ఫిర్యాదు

నటి మీరా చోప్రా పై బిజెపి ఫిర్యాదు చేసింది. బిజెపి ఫిర్యాదు చేయడం ఏంటని అనుకుంటున్నారా…!! నటి మీరా చోప్రా ఇటీవల వ్యాక్సిన్ వేయించుకుంది. అందుకు సంబంధించిన ఫోటోను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. అంతే కాకుండా ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకోవాలని ట్యాగ్ లైన్ కూడా ఇచ్చింది. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఆమె ఫ్రంట్ లైన్ వారియర్ కోటాలో ఫేక్ ఐడి తో వ్యాక్సిన్ వేయించుకున్నారు అని మహా రాష్ట్ర బిజెపి నాయకులు ఆరోపించారు.

ఇది ఫేక్ ఐడి అని దీనిపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే మీరా చోప్రా మాత్రం ఆ ఆరోపణలను కొట్టిపారేశారు. సోషల్ మీడియాలో తన పేరిట ప్రచారంలో ఉన్న ఐడి కార్డ్ తనది కాదని ఇలాంటి చర్యలకు తాను వ్యతిరేకమని చెప్పుకొచ్చింది. ఇక మీరా చోప్రా విషయానికొస్తే తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బంగారం సినిమా లో నటించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement