Monday, April 29, 2024

‘ది వారియ‌ర్’ నుంచి బిగ్ అప్‌డేట్‌.. టీజ‌ర్ డేట్ చెప్పిన మేక‌ర్స్

విభిన్న క‌థ‌ల‌ను ఎంచుకుంటూ వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న యువ హీరో రామ్ పోతినేని. ప్ర‌స్తుతం లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ‘ది వారియ‌ర్’ చిత్రంలో న‌టిస్తున్నాడు. రామ్ కెరీర్‌లోనే మొద‌టి సారిగా కాప్ రోల్‌లో న‌టిస్తున్నాడు. రామ్‌కు జోడీగా కృతిశెట్టి హీరోయిన్‌గా ఉంది. ద్విభాషా చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాను శ్రీనివాస సిల్వ‌ర్ స్క్రీన్ ప‌తాకంపై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నాడు. ఆది పినిశెట్టి విల‌న్ గా క‌నిపించ‌నున్నాడు. ప్ర‌స్తుతం షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ సినిమా జూలై 14న విడుద‌ల కానుంది.

ఈ క్ర‌మంలో చిత్ర బృందం వ‌రుస అప్‌డేట్‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రిస్తోంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్‌లుక్ టీజ‌ర్ మే 14న సాయంత్రం 5.31 నిమిషాల‌కు విడుద‌ల చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఇదివ‌ర‌కే చిత్రం నుంచి విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు, పాట‌ల‌కు ప్రేక్ష‌కుల నుంచి విశేష స్పంద‌న వ‌చ్చింది. ఈ చిత్రంలో రామ్ పోలీస్ అధికారిగా క‌నిపించ‌నున్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement