Sunday, April 14, 2024

AP: దుర్గ‌మ్మ స‌న్నిధిలో భీమా…

హీరో గోపిచంద్ ఇంద్ర‌కీలాద్రి అమ్మ‌వారిని ద‌ర్శించుకొని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఈ సందర్భంగా గోపీచంద్కి అర్చకులు ఆశీర్వాదం అందించారు. అంతకుముందు ఆలయ అర్చకులు ఆలయ సాంప్రదాయం ప్రకారం హీరో గోపీచంద్కు స్వాగతం పలికారు.

కాగా, టాలీవుడ్ న‌టుడు గోపీచంద్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌స్తున్న తాజా చిత్రం ‘భీమా’. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమాకు కన్నడ దర్శకుడు ఏ హర్ష ద‌ర్శ‌క‌త్వం వహిస్తుండ‌గా.. ప్రియా భవానీ శంకర్‌, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా మ‌హా శివ‌రాత్రి కానుక‌గా మార్చి 08న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక విడుద‌ల తేదీకి ఇంకా నెల రోజులు స‌మ‌యం ఉండ‌టంతో ప్ర‌మోష‌న్స్ మొద‌లుపెట్టింది చిత్ర‌బృందం. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్‌ పోస్టర్‌తో పాటు టీజ‌ర్ విడుద‌ల చేయ‌గా.. సాలిడ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమా మహా శివరాత్రి కానుకగా మార్చి 08న ప్రేక్షకుల ముందుకు రానుంది. . సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో భాగంగా విజయవాడ వెళ్లిన గోపీచంద్ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement