Sunday, April 21, 2024

నాలో స్ఫూర్తి నింపిన వ్యక్తి చిరంజీవి – హీరో కార్తికేయ

యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ, నేహా శెట్టి జంటగా నటిస్తున్న సినిమా ‘బెదురులంక 2012’. లౌక్య ఎంటర్‌-టైన్‌మెంట్స్‌ పతాకంపై సి. యువరాజ్‌ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిం చారు. క్లాక్స్‌ దర్శకుడు. శుక్రవారం ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా మీడియాతో కార్తికేయ ముచ్చటించారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు.

..- ఈ కథ మీ దగ్గరకు ఎలా వచ్చింది?అజయ్‌ భూపతి ద్వారా దర్శకుడు క్లాక్స్‌ పరిచయం అయ్యారు. కరోనా సమయంలో క్లాక్స్‌ కథ చెప్పాడు. ఆ సమయంలో ప్రపంచం అంత అయిపోతుందని అన్నట్లు- ప్రచారం జరిగింది కదా! కథకు బాగా కనెక్ట్‌ అయ్యాను. కథలో కొత్తదనం, వినోదం ఉండటంతో ఓకే చేశా.-

మీకు చెప్పిన కథను దర్శకుడు క్లాక్స్‌ తెరపైకి తీసుకొచ్చారా?బెదురులంక 2012 కథకు రిఫరెన్స్‌ ఏమీ లేదు. అంత కొత్తగా ఉంటు-ంది. సినిమా కంప్లీట్‌ అయ్యాక చూసుకున్నా. నాకు చాలా హ్యాపీగా అనిపించింది.-

శివ శంకర వరప్రసాద్‌ పేరు మీరే సూచించారా!?

- Advertisement -

సినిమాలో క్యారెక్టర్‌ పేరు శివ. ఆ సన్నివేశం దగ్గర శివ షో బిగిన్స్‌, శివ ఆట మొదలు అన్నట్లు- చెప్పాలి. ఇంపాక్ట్‌ సరిపోవడం లేదని, శివ పేరు చిన్నగా ఉందని అనుకుంటు-న్నాం. సెట్‌లో ఎవరో శివ శంకర్‌ అయితే బావుంటు-ందేమో అన్నారు. అప్పుడు శివ శంకర వరప్రసాద్‌ పేరు ఆలోచన వచ్చింది.-

శివ క్యారెక్టర్‌ గురించి చెప్పండి!

శివ ఓ స్వేచ్ఛా జీవి. తనకు నచ్చినట్లు- జీవిస్తాడు. సిటీ-లో గ్రాఫిక్‌ డిజైనర్‌ జాబ్‌ మానేసి ఊరు వెళతాడు. ఎవరి గురించి పట్టించుకోడు. అలాగని, ఎవరినీ ఇబ్బంది పెట్టడు. వాడి పని వాడు చేసుకుంటాడు. నచ్చని విషయం చేయమంటే అసలు చేయడు.-

-టైలర్‌ చూసిన రామ్‌చరణ్‌ ఏమన్నారు?

ఆయనకు నచ్చింది. మ్యూజిక్‌ బావుందని చెప్పారు. షాట్స్‌ మేకింగ్‌, నేహా శెట్టితో నా జోడీ బావుందని చెప్పారు. శివ శంకర్‌ వరప్రసాద్‌ డైలాగ్‌ గురించి సరదాగా మాట్లాడుకున్నాం.-

మీకు, నేహా శెట్టి మధ్య సన్నివేశాలు ఎలా ఉంటాయి?బెదురులంక ప్రపంచం మాత్రమే తెలిసిన ప్రెసిడెంట్‌ గారి అమ్మాయిగా నేహా శెట్టి కనబడుతుంది. శివతో ప్రేమలో ఉంటు-ంది. సాంగ్స్‌, సీన్స్‌ షూట్‌ చేసినప్పుడు మా మధ్య కెమిస్ట్రీ వర్కవుట్‌ అయ్యిందని అర్థమైంది.-

నిర్మాత బెన్నీ ముప్పానేని సహకారం ఎలా ఉంది?

కథ 2012 నేపథ్యంలో, పల్లెటూరిలో జరుగుతుంది. ప్రజలు పరుగులు తీసే సీన్‌ ఒకటి ఉంది. ఎక్కువ మంది జనాలు కావాలి. ఖర్చు విషయంలో నిర్మాత అసలు రాజీ పడలేదు. కథ చెప్పడానికి ఏమేం కావాలో అవన్నీ సమకూర్చారు. సంగీత దర్శకుడిగా మణిశర్మను తీసుకొచ్చారు. కథానాయికగా నేహా శెట్టిని సజెస్ట్‌ చేశారు.-

మణిశర్మ ఈ సినిమాకు ఎటు-వంటి బలాన్ని ఇచ్చారు?

మణిశర్మ గారి నేపథ్య సంగీతం సినిమాకు ఎంతో బలాన్ని ఇచ్చింది. అఫ్‌కోర్స్‌… సాంగ్స్‌ అన్నీ సూపర్‌ హిట్‌ అయ్యాయి.-

చిరంజీవి గొప్పతనం గురించి ఇటీ-వల మీరు చెప్పిన మాటలు వైరల్‌ అయ్యాయి. ఆ వ్యాఖ్యలు అభిమానిగా చేసినవేనా?

ఓ ఇంటర్వ్యూలో అడిగితే సమాధానం చెప్పా. ఆయనకు నేను అభిమానిని. అంత కంటే ఎక్కువగా నాలో స్ఫూర్తి నింపిన వ్యక్తి చిరంజీవి గారు

Advertisement

తాజా వార్తలు

Advertisement