Sunday, March 3, 2024

హీరోగా మేకోవర్ అవుతున్న బండ్ల గణేష్

బండ్ల గణేష్ గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. నటుడిగా నిర్మాతగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు బండ్ల గణేష్. అయితే బండ్ల గణేష్ ఇప్పుడు హీరోగా మారబోతున్నారు. తమిళంలో పార్తిబన్ హీరోగా వచ్చిన ఒత్తు సెరుప్పు సైజ్ 7 ను తెలుగులో బండ్ల గణేష్ చేయబోతున్నారు. దీనికి తెలుగులో వెంకట్ చంద్ర దర్శకత్వం వహించబోతున్నారు.

ఈ సినిమాను హిందీ రీమేక్ లో అభిషేక్ బచ్చన్ నటిస్తుండగా… షూటింగ్ చెన్నైలో ఈమధ్య మొదలైంది. తెలుగు రీమేక్ గురించి దర్శకుడు వెంకట్ చంద్ర మాట్లాడుతూ బండ్ల గణేష్ ఈ పాత్రకి సరిపోతాడని ఇక ఆ పాత్రకోసం మేకోవర్ కూడా అవుతున్నాడని సెప్టెంబర్ మొదటి వారంలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement